కందుకూరులో లక్ష్మీ నాయుడి హత్య బాధాకరం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని పరామర్శించాం అని తెలిపారు. ఆర్థిక లావాదేవీల వల్లే లక్ష్మీ నాయుడి హత్య జరిగిందని, నిందితుడికి బెయిల్ రాకుండా శిక్షపడేలా చేస్తాం అని చెప్పారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పులేదు అని, తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముంది అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ గారు డిఎస్పీపై నివేదిక కోరవచ్చు, అందులో తప్పేంటి. భీమవరం డిఎస్పీ వ్యవహార శైలికి సంబంధించి నివేదిక హోంశాఖ దగ్గర ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్.. డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పు లేదు. తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముంది. కూటమి ప్రభుత్వంలో శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తున్నాం. మాకు మాకు ఎలాంటి ఇగోలు లేవు. డీఎస్పీ జయసూర్యకు సంబంధించిన నివేదిక మా వద్ద ఉంది. తగిన చర్యలు తీసుకుంటాం’ అని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.
Also Read: AP News: మాయమాటలు చెప్పి.. పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం, చివరకు..!
‘కందుకూరులో లక్ష్మీ నాయుడు హత్య బాధాకరం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణతో కలిసి తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని పరామర్శించాము. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా ఉన్నారు. కుటుంబ నేపథ్యం అంతా చూశాం. హత్య కేవలం ఆర్ధిక లావాదేవీల కారణంగానే జరిగింది. మంచి స్నేహితులుగా ఉండి వ్యాపారం చేసుకున్నారు. చిన్న ఆర్ధిక లావాదేవీలతో వీరి మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు హత్యకు దారి తీసింది. కార్ దాడితో ఇంత దారుణంగా హత్య చేసే పరిస్థితి రాకూడదు. నిందితుడికి శిక్ష పడాలని లక్ష్మీ నాయుడు భార్య కోరారు. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చూస్తాం. హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాం’ అని హోంమంత్రి తెలిపారు.
