MLC Kavitha : హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర స్పందన తెలియజేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఫోన్‌లో మాట్లాడారు. యువతిపై జరిగిన దాడి ఘటన గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. తనను రక్షించుకునేందుకు రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనపై స్పందిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది,” అని మండిపడ్డారు. “మేము ఎన్నిసార్లు మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని హెచ్చరించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది అదే నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. ఇప్పుడు మరో యువతి దాడికి గురైంది,” అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంఎంటీఎస్ ఘటన రాష్ట్రంలో మహిళల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. “ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
Hyderabad: మండి రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.. పాడైపోయిన చికెన్, బొద్దింకలు దర్శనం