Site icon NTV Telugu

MLC Vamsi Krishna: విశాఖకు దొరికిన ఆణిముత్యాలు.. ఆ ఇద్దరిపై ఎమ్మెల్సీ వంశీకృష్ణ సెటైర్లు

Mlc Vamsi Krishna

Mlc Vamsi Krishna

MLC Vamsi Krishna: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేన పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కీలక పదవి కట్టబెట్టారు.. విశాఖ జనసేన అధ్యక్షుడిగా వంశీకృష్ణను నియమించారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన వెంటనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో జనసేన పార్టీ వ్యవహారాలన్నింటినీ ఆయనే చూసుకుంటారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌.. మరోవైపు.. దూకుడు చూపిస్తున్నారు వంశీకృష్ణ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీపై సెటైర్లు వేశారు.. విశాఖకు దొరికిన ఆణిముత్యాలు ఎంపీ ఎంవీవీ, జీవీ అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ, జనసేన విశాఖ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్..

Read Also: Guntur Kaaram: రన్ టైమ్ కి కూడా భయపడుతున్నారు ఏంట్రా బాబు… ఆ కుర్చీని మడతపెట్టి…

అంతేకాదు.. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన నవరత్నాల్లో రెండు రత్నాలు ఇవే అంటూ ఎంవీవీ, జీవీపై విరుచుకుపడ్డారు వంశీ కృష్ణ. జీవి అనే వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నాడా..? జెండా రంగులు తెలుసా..? అని ప్రశ్నించారు. విశాఖలో ఉన్న బిల్డర్స్.. ఎంవీవీ, జీవీని చూసి భయపడుతున్నారన్నారు.. వేరే రాష్ట్రాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇక, సంక్రాంతి పండుగ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ చేయబోతున్నాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. ఎన్నికల తరువాత విశాఖ మేయర్ పదవి కోసం ఆలోచిస్తాం.. వైసీపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ, జనసేన విశాఖ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌.

Exit mobile version