Talasila Raghuram: ఏబీవీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. పవన్ కళ్యాణ్ స్పందించాలి!
- వైఎస్ జగన్ రెడ్డిపై ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు
- ఏబీవీ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం
- డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలన్న తలసిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నాం అని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం పేర్కొన్నారు. ఏబీవీ అహంకారంతో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారని, కుల అహంకారంతో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయని తెలుసుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ రెడ్డిలు ఏనాడు కులం కోసం పని చెయ్యలేదని.. కుల, మతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టే 40 శాతం ఓట్లు సాధించారన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని తలసిల రఘురాం డిమాండ్ చేశారు.
‘ఏబీ వెంకటేశ్వరరావు మాజీ సీఎం జగన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనం. వైసీపీ తరఫున ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఏబీవీ అహంకారంతో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారు. కుల అహంకారంతో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయని తెలుసుకోవాలి. వైయస్సార్, వైఎస్ జగన్ ఏనాడు కులం కోసం పని చెయ్యలేదు. కులమతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టే 40 శాతం ఓట్లు సాధించారు. ఏబీవీ తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను కమ్మ కులం మొత్తానికి అపాదించడం ఏంటి?, ఏబీవీ భాష గొడ్లు కాసేవారి భాషలా ఉంది. కమ్మ అధికారులు అందరూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ఏబీవీ వ్యాఖ్యలపై స్పందించాలి. లేదంటే పవన్ కూడా కమ్మ కులానికి మద్దతిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తారు’ అని ఎమ్మెల్సీ తలసిల రఘురాం అన్నారు.
Also Read
- Vaibhav Vs GT: వైభవ్‌ను బోల్తా కొట్టించే ప్లాన్స్ రెడీ.. అద్భుత ప్రణాళికతో బరిలోకి గుజరాత్ టైటాన్స్..
- Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
- SRH: బిగ్‌షాక్.. కాటేరమ్మ కొడుకుల కథ ముగింపు.. వచ్చే సీజన్‌కు ఆ ఏడుగురు ఆటగాళ్లు దూరం..
- Trinamool congress: బెంగాల్లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?
తాజావార్తలు
-
CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
-
Vaibhav Vs GT: వైభవ్‌ను బోల్తా కొట్టించే ప్లాన్స్ రెడీ.. అద్భుత ప్రణాళికతో బరిలోకి గుజరాత్ టైటాన్స్..
-
Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
-
Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
-
SRH: బిగ్‌షాక్.. కాటేరమ్మ కొడుకుల కథ ముగింపు.. వచ్చే సీజన్‌కు ఆ ఏడుగురు ఆటగాళ్లు దూరం..
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!