Site icon NTV Telugu

Ramulu Naik : తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ అడుగడుగునా మోసం చేస్తున్నాడు

Ramulu Naik

Ramulu Naik

తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ అడుగడుగునా మోసం చేస్తున్నాడన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు ఇవ్వవలిసిన పోడు భూములు ఇవ్వటం లేదని, కొమరం భీమ్ జిల్లాలో పోడు భూములకు పట్టాలు ఇస్తాం అని ఇంకా ఇవ్వ లేదన్నారు. 4 లక్షల దరఖాస్తుదారులు ఉంటే, 1 లక్ష 50 వేలు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్‌ అని ఆయన దుయ్యబట్టారు. మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయాలన్నారు. అంతేకాకుండా.. ‘ఇందిరమ్మ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు లాక్కొని వారిని అన్యాయం గా జైలుకి పంపిస్తున్న సందర్భాలు చూస్తున్నాం.. హరిత హారం తో ఎన్ని చెట్ల నాటలరు అనేది శ్వేత పత్రం విడుదల చేయాలి.. హరిత హారం పేరిట భూములు గుంజుకుంటున్నారు.. ఇందిరా గాంధీ ఇచ్చిన అసెండ్ ల్యాండ్ లను గుంజుకుని ప్రైవేట్ ఇండస్ట్రీ లకు కట్టబెడుతున్నారు.. ఎక్కడైనా ప్రభుత్వాలు భూములు ప్రజల వద్ద తీసుకుంటే బదులుగా భూములు ఇస్తారు.

Also Read : Suraj Kumar: ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో కాలు తీసేసిన వైద్యులు

లేక పొతే అక్కడ నెలకొనే ఇండస్ట్రీస్ లో జాబ్ కల్పిస్తారు…కానీ కేసీఆర్ సర్కార్ లో అలాంటి అవకాశం లేదు.. ఎస్సీ, ఎస్టీల వద్ద అసైన్డ్‌ భూములు గుంజుకున్నరు.. ఎక్కడ ఎన్ని భములు తీసుకున్నారానేది ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇందిరా గాంధీ పేదవారికి ఇచ్చిన భూములతో సొమ్ము చేసుకుంటుంది కేసీఆర్‌ ప్రభుత్వం.. ధరణి వచ్చాక 3 లక్షల ఎకరాల భూములు గుంజుకున్నారు.. దున్నుకుంటున్న రైతులని జైలు కి పంపిస్తున్నారు. ఎన్నికలకు 5 నెలలు సమయం వున్న తరుణం లో మరోసారి నాటకాలకు తెరలేపారు. మీ భూములను మీరు దున్నుకోండి మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. అవసరం అయితే మేమూ జైలు కి పోవటాకి అయినా సిద్ధం.. ఇబ్రహీంపట్నం లో 5000 వేల ఎకరాల భూములు మాయ మాటల తో తమ ఆదీనం లోకి తీసుకుంది ఈ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని దించటానికి ఇదే మంచి సమయం.. నారాయణ్ పురం లో పట్టాలు రికార్డు లో వచ్చాయి.. కానీ రైతు బందు ఇంకా ఇవ్వలేదు.. మహబూబాబాద్ లోని నారాయణపురంలో 1500 ఎకరాల పట్టా భూములను ఫారెస్టులాండ్ అంటున్నారు.. ధరణి విషయం కొస్తే తెల్లాపూర్ సంబదించిన భూములు మాయమయ్యాయి..’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Shree Cement: శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!

Exit mobile version