Site icon NTV Telugu

Pothula Sunitha: జగన్‌పై బురద జల్లేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు..

Pothula Sunitha

Pothula Sunitha

Pothula Sunitha: పేద, బడుగు వర్గాల వారి ముఖ్యమంత్రి జగన్‌ అహ్నరిశలు కృషి చేస్తున్నారని, దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్‌ జగన్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనితకు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ చరిత్ర చంద్రబాబుది అంటూ ఆమె ధ్వజమెత్తారు.

“అనిత అన్నం తింటుందా? గడ్డి తింటుందా?. అనిత పచ్చకామెర్లతో బాధ పడుతోంది. అందుకే ఎన్.సీ.ఆర్.బీ రిపోర్టుని కూడా పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. హోంమంత్రి, మండలి వైస్ ఛైర్మన్ లాంటి ముఖ్యమైన పదవుల్లో సైతం మహిళలే ఉన్నారు. చంద్రబాబు చరిత్ర అంతా‌ మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందే. ఎన్టీఆర్ నుండి పార్టీని లాక్కునే దగ్గర్నుండి అనేక విషయాల్లో మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందే. ఎందుకిలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు?. దిశ యాప్‌తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. పదవుల్లో సైతం మహిళకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. పవన్, చంద్రబాబు, లోకేష్ వాలంటీర్ల మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో తోక ముడిచారు. మహిళల పుట్టుక గురించే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నా టీడీపీ నేతలు చూడలేకపోతన్నారు.” అని పోతుల సునీత మండిపడ్డారు.

Also Read: Srisailam: శ్రీశైలంలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు

విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడిపిన వారికి చంద్రబాబు పదవులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. రిషితేశ్వరి ఘటనను కప్పి పుచ్చే ప్రయత్నం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది అంటూ సునీత మండిపడ్డారు. బీసీల తోక కట్ చేస్తా, తోలు తీస్తా అన్న చంద్రబాబు బీసీలకు ఇంకేం న్యాయం చేస్తారని ఆమె ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌లకు లేదన్నారు. మహిళల మిస్సింగులు ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువని సునీత వెల్లడించారు. కానీ జగన్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు పవన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.

Exit mobile version