MLC Nagababu: భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు.. ‘కోవా బన్’ వలీకి అండగా నాగబాబు!
- చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం అండ
- 'కోవా బన్’ వలీకి అండగా నాగబాబు
- నాగబాబు వ్యక్తిగతంగా రూ.25 వేల ఆర్థిక సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు స్పష్టం చేశారు. పొట్టకూటి కోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం సరైనది కాదన్నారు. ఇటీవల కోవా బన్ను అమ్ముకుంటున్న ఒక చిరు వ్యాపారిపై జరిగిన ఘటన తర్వాత, అతను శివరాత్రి రోజున కూడా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేయడంతో.. వ్యక్తిగతంగా రూ.25 వేల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని, ఎలాంటి అనుమానాలు ఉన్నా చట్టపరంగా అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు సూచించారు. వలి వంటి చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఈ దాడిని ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయడం అభినందనీయమన్నారు.
Also Read
- Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
- FCRA Bill: 'మా చట్టాల గురించి మీకెందుకు?'.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
- Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా'.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
- Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
Also Read: Pathum Nissanka: శ్రీలంక ‘సూపర్ స్టార్’ పాతుమ్ నిశాంక.. సంగా-సూర్య-జయ లాగే..!
ఈ ఘటనను మత కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేసిన నాగబాబు.. తక్కువ మూలధనంతో స్వయం ఉపాధి చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్న చిరు వ్యాపారులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40 శాతం పైగా పేద ప్రజలు చిరు వ్యాపారులపై ఆధారపడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నాగబాబు సూచించారు. ఇటీవల మేడారం మహా జాతరలో కర్నూలుకు చెందిన వలీ.. రూ.10కే కోవాబన్ను విక్రయిస్తుండగా కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అతడిని ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కుటుంబం వ్యాపారం చేసుకునేందుకు భయపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయనలో ధైర్యాన్ని నింపేందుకు వలీకి రాజకీయ నాయకులూ అండగా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
-
Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!