Site icon NTV Telugu

MLC Kavitha: గోదావరి నీళ్లను ఆంధ్రా వాళ్లు ఎత్తుకుని పోతున్నారు.. కవిత హాట్ కామెంట్స్..!

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్‌ఎస్ నేత మదన్ లాల్ నివాసంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మదన్ లాల్ మరణం ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. రెండు నెలల క్రితం వారి కుటుంబంలో మరో విచారకర ఘటన చోటుచేసుకున్నదని గుర్తుచేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కవిత, “వైరా నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ జెండాను ఎగురదిద్దాం” అని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

Read Also:Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పరుగులు.. నెలరోజులుగా ఇదే తంతు

కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డ కవిత, ‘‘ఎక్కడ చూసినా వానలు పడుతున్నాయని.. కాబట్టి రైతు బంధు, రైతు భరోసా పథకాలను అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్దామని కాంగ్రెస్ భావిస్తోంది’’ అని విమర్శించారు. ‘బోనస్ ఇస్తామని చెప్పి, సన్న వడ్లు వేయమని చెప్పి బోనస్ పేరుతో బోగస్ చేశారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతులపై ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్, నిజంగా రైతుల గురించి ఆలోచిస్తే 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని, లేకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా రైలు రోకో నిర్వహిస్తామని ప్రకటించారు.

ఈ ఉద్యమానికి ఆర్. కృష్ణయ్య, సీపీఐ ఎంఎల్ వంటి పార్టీల మద్దతును కోరినట్లు చెప్పారు. “ఏక్ ఆర్ దక్క – బీసీ బిల్లు పక్కా’’ అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని తెలిపారు. మరోవైపు ఖమ్మం జిల్లాను ఉద్యమాల ఖిల్లాగా కవిత వర్ణించారు. ఇక్కడ ప్రారంభమైన ఉద్యమమే రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిందని గుర్తుచేశారు. ప్రజలను రైలు రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కావాలనే కేసులు పెడుతున్నారని ఆరోపించిన కవిత, ముగ్గురు మంత్రులను అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని కోరారు. బనకచర్ల నుండి గోదావరి నీటిని ఆంధ్రా రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ, అమాయకులపై కేసులు పెట్టడం ఆపాలని డిమాండ్ చేశారు.

Read Also:Rishabh Pant: మరోసారి వేలంలోకి రిషబ్ పంత్

కేంద్రం పాలనపై మరోసారి విమర్శలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు గ్రామాలను తెలంగాణ నుండి తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కు వ్యతిరేకంగా జరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రధానిని మా బడే భాయ్.. అంటున్నారు, అయితే ఆ గ్రామాలను తిరిగి మనకు తీసుకురాగలిగితే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

Exit mobile version