ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్‌కు రావాలి అనుకొని కూడా రాలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వరంగల్ ప్రజలు అడుగుతారఅని రాహుల్ రాలేదన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేర్చే వరకు వెంటబడతాం అని హెచ్చరించారు. మార్చి 8న మహిళా శంఖారావం జరగబోతోందని, ఇందిరా పార్కు దగ్గర జరిగే ఈ మీటింగ్లో మహిళల సత్తా చాటుతాం అని కవిత పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో రోజూ ఒక లొల్లి జరుగుతుంది. ఈరోజు ఉదయం శివాలయంలో జరిగిన విషయంపై మళ్ళీ గొడవ మొదలైంది. శాంతి భద్రతల మీద ఈ ప్రభుత్వంకు ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ మొదటి వరుసలో ఉంటుంది. ఎన్నికల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలచే హామీలు ఇప్పించారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్‌కు రావాలనుకొని కూడా రాలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వరంగల్ ప్రజలు అడుగుతారని రాహుల్ రాలేదు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చే వరకు వెంటబడతాం. మార్చి 8న మహిళా శంఖారావం జరగబోతోంది. ఇందిరా పార్కు దగ్గర జరిగే ఈ మీటింగ్లో మహిళల సత్తా చాటుదాం’ అని పిలునిచ్చారు.