Site icon NTV Telugu

MLC Kavitha: మోడీ నోటీసు వచ్చింది.. పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు

Kavitha

Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పంపిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. నిజామాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మోడీ నోటీసు వచ్చిందని తెలిపారు. దానిని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె కొట్టి పారేశారు. ఇది రాజకీయకక్షతో వచ్చిందేనని.. ఏడాది నుంచి టీవీ సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఈడీ నోటీసులపై తమ పార్టీ లీగల్ సెల్‌ వాటిని పరిశీలిస్తోంది.. న్యాయ నిపుణుల సలహాను అనుసరించి నిర్ణయం తీసుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారు. మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికల వస్తుండటంతో కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.

Exit mobile version