Site icon NTV Telugu

MLC Kavitha: సొంత చెల్లిపై కుట్రలు జరుగుతుంటే.. కేటీఆర్ స్పందించరా?

Mlc Kavitha

Mlc Kavitha

కొందరు బీఆర్ఎస్ నేతలు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తన సొంత అన్నయ్య, బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని తనపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నా అని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్పందించరా?.. 103 రోజులైనా కేటీఆర్‌ అడగరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి తీహార్‌ జైలులో ఐదున్నర నెలలు ఉండి వచ్చాక కూడా.. గతేడాది నవంబర్‌ 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు.

‘నన్ను సస్పెండ్‌ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్‌ నుంచి ఓ ప్రకటన వచ్చింది. తీహార్‌ జైలు నుంచి వచ్చిన తరువాత ఎన్నో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడడం పార్టీ వ్యతిరేకమా?. నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నా. కేసీఆర్‌ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నా. నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. నాపై కుట్రలు జరుగుతుంటే.. చెల్లిగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నా. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్పందించరా?. 103 రోజులైనా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అడగరా?’ అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

Exit mobile version