దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మొదటిసారి కవితను ఇంటివద్దనే ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఆ తరువాత ఢిల్లీలోకి కేంద్ర కార్యాలయానికి రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల 11న ఢిల్లీ ఈడీ ముందు హాజరైన కవితను ఈడీ అధికారలు సుమారు 9 గంటల పాటు విచారించారు. ఆతరువాత ఈనెల 16న మరోసారి ఈడీ కార్యాలయానికి రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడంతో.. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈడీ నిబంధనలు ఉల్లంఘించిందని సర్వోన్నత న్యాయస్థానంలో కవిత పిటిషన్ వేశారు. దీంతో ఈనెల 24న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు కవిత పిటషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కవిత తరుఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత నిందితురాలు కాదని, సమన్ల విషయంలో ఈడీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాలేదన్నారు.
Also Read : T.Congress : రచ్చకెక్కిన హనుమకొండ కాంగ్రెస్ వర్గ పోరు
చార్జి షీట్ ఇప్పటికే దాఖలు చేశారని, నళిని చిదంబరం కేసులతో ఓ సారి పరిశీలించాలన్నారు. దీనిపై.. పీఎంఎల్‌ఏ కేసులలో మదన్ లాల్ జడ్జిమెంట్ వర్తించదని ఈడీ వాదనలు వినిపించింది. ఇరువైపు వాదనలు విన్న సుప్రీం కోర్టు.. నళిని చిదంబరం కేసుతో కవిత కేసు ట్యాగ్ చేసింది. దీంతో.. అడిషనల్ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. దీనిపై విచారణ చేసిన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం స్పందిస్తూ.. ఈ కేసులో చాలా కోర్ అంశాలున్నాయని, అన్నింటినీ లోతుగా విచారణ చేయాలని వెల్లడించింది. ఈ కేసులో తమకు ఒక నోటు ఇవ్వాలని కపిల్ సిబిల్ కు సూచించింది సుప్రీంకోర్టు. అయితే.. వాదనలు విన్న సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌పై విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
Also Read : Charan NTR: ఈ ట్వీట్ కోసం కదా ఇంతసేపు వెయిట్ చేసింది…