Site icon NTV Telugu

MLC Kavitha : సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

Kavitha On Bjp

Kavitha On Bjp

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు సీబీఐ అధికారులు. అంతేకాకుండా.. మిమ్మల్ని విచారించడానికి మీకు అనుకూలంగా ఉండే మీ నివాసం లేదా.. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఏదో చెప్పాలని కోరింది. ఈనేపథ్యంలో.. ఈ సీబీఐ నోటీసులపై కవిత స్పందించారు. తనకు సీబీఐ నోటీసులు అందాయని… విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు.
Also Read : Woman Drinker : దేంట్లో మేం తక్కువ.. తాగుతాం.. తాళాలు పగలకొడతాం

వారి అభ్యర్థన మేరకు హైదరాబాద్ లోని తన నివాసంలో తనను ప్రశ్నించాలని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చానని వెల్లడించారు కవిత. అంతేకాకుండా.. ఈ మేరకు ఆమె సీబీఐ ఉన్నతాధికారి అలోక్ కుమార్‌కు లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు కవిత. ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్‌ఐఆర్‌ను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరిన కవిత.. సంబంధిత అనుబంధ కాపీలను కూడా అందించాలన్నారు. డాక్యుమెంట్లు పంపిన తర్వాతే వివరణ తేదీ ఫిక్స్ చేద్దామని కవిత లేఖలో పేర్కొంది కవిత.

Exit mobile version