MLC Kavitha: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కేటీఆర్, హరీష్ రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరూ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు కేటీఆర్, హరీష్ రావులు అక్కడ పర్యటించనున్నారు. మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. బెయిల్ కోసం కవిత కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈడీ కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు అందజేయడంతో బెయిల్ విషయంలో ఆమెకు నిరాశే ఎదురైంది.
Read also: Cinema News : సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో ట్రెండింగ్ ఉన్న స్టార్ హీరో..?
తాజాగా ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాల బెయిల్ పిటిషన్లను విచారించిన ధర్మాసనం కస్టడీని ఆగస్టు 9 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.అంతకుముందు కోర్టు విధించిన గడువు ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు ముగ్గురిని కోర్టు ముందు హాజరుపరిచారు. కస్టడీని పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Hero Nani: నాకు ఇప్పుడు ఆ ఆసక్తి లేదు: నాని