Site icon NTV Telugu

Soma Bharat: కవిత ఇంట్లో ఈడీ సోదాలపై న్యాయవాది ఏమన్నారో తెలుసా..?

Soma Bharat

Soma Bharat

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు మూడు గంటలకుపైగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఈడీ అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుండి ఈడీ అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదన్నారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్ ఉంది.. పెండింగ్ లో కేసు ఉండగా ఈడీ అధికారులు ఎలా కవిత ఇంటికి వస్తారని ప్రశ్నించారు. తాను ఈడీ అధికారులతో మాట్లాడిన తరువాత మరోసారి మాట్లాడుతానని తెలిపారు.

Civil Supplies Department: ధాన్యం తాజా టెండ‌ర్లతో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ.1,110.51 కోట్ల లాభం..

మరోవైపు.. సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు మాట్లాడుతూ, కవిత నివాసంలో ఈడీ అధికారులు 3 గంటలకు పైగా సోదాలు చేస్తున్నారని తెలిపారు. సుప్రీం కోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చింది.. ఎలాంటి చర్యలు తీసుకోము అని ఈడీ కోర్టులో చెప్పిందని పేర్కొన్నారు. ఈ నెల 19న సుప్రీం కోర్టులో విచారణ ఉందని.. స్టేట్మెంట్ రికార్డ్ లో భాగంగా సెల్ ఫోన్ లు సీజ్ చేస్తారని అన్నారు. కవిత ఒక మహిళ కాబట్టే ఇంటికి వచ్చి ఈడీ అధికారులు విచారిస్తున్నారని చెప్పారు. కవిత వేసిన పిటిషన్ కూడా ఇంటి వద్ద విచారించాలనేనని ఆయన తెలిపారు. ఈరోజు ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోదని.. ఒకవేళ ఈడీ ఏదైనా చర్య తీసుకుంటే, అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుందని అన్నారు.

PM Modi: ఈసారి కేరళలో రెండంకెల సీట్లు గెలుచుకుంటాం

Exit mobile version