ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే మార్చి 11న ఆమె ఈడీ ముందు హాజరయ్యారు. ఆమెను ఈడీ తొమ్మిది గంటల పాటు విచారించింది. అయితే.. మరోసారి మార్చి 16న ఈడీ విచారణ హాజరుకావాలని కవితకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. దీంతో.. మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో యథావిధిగా ఈనె 16న కవిత ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. న్యాయవాదులతో తను విచారణకు హాజరుకాలేనని, సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌ను ప్రస్తావిస్తూ సమాచారం పంపారు.
Also Read : IND vs AUS 2nd ODI: ఘోర పరాజయం.. టీమిండియా పేరిట చెత్త రికార్డులు
అయితే.. ఆమె విజ్ఞప్తిని నిరాకరించిన ఈడీ.. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో.. నేడు ఈడీ ముందుకు కవిత హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే కాసేపటికి ఎస్కార్ట్ వాహనాలతో ఈడీ విచారణకు బయలు దేరారు కవిత. రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. నిన్నటి వరకు కవిత ఈడీ ముందు హాజరవుతారా..? అనే ఉత్కంఠ కొనసాగింది. ఈ రోజు ఆమె ఈడీ విచాణకు బయలు దేరడంతో ఆ ఉత్కంఠకు తెరపడింది.
Also Read : Crime : కుక్కపై వ్యక్తి అత్యాచారం.. కేసు నమోదు చేసిన పోలీసులు