MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోమారు రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు ఆమె అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్ట్ కార్డ్ రాశారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అని అన్నారు. తన కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టం చేయరని, కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసునన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
Read Also: Beautician Anusha: కుటుంబ కలహలు.. మనస్తాపంతో ఓయో హోటల్లో యువతి ఆత్మహత్య.!
అలాగే ఆమె మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబును పిలిచి ప్రజాభవన్ లో హైదరాబాద్ బిర్యానీ తినిపించింది రేవంత్ రెడ్డి. గోదావరి నీటిని గిఫ్ట్ ప్యాకెట్ కట్టి రేవంత్ చంద్రబాబుకు ఇచ్చారన్నారు. కేసీఆర్ హాయాంలో బనకచర్ల ఊసే లేదు. సీఎం హోదాలో కేసీఆర్ ఎక్కడ సంతకాలు పెట్టలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తప్పుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నమన్నారు.
Read Also: Local Body Elections: హైకోర్టు కీలక తీర్పు.. స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్..!
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని, హైకోర్టు ఇచ్చిన సమయం లోపు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆమె అన్నారు. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ ను తెలంగాణ సమాజం క్షమించదని ఆమె వ్యాఖ్యానించారు.
