Site icon NTV Telugu

MLC Kavitha : బీఆర్ఎస్‌ లోక్‌సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Mlc Kavitha

Mlc Kavitha

నిజామాబాద్ బీఆర్ఎస్‌ లోక్‌సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను అధిష్టానం నేతలను కలవకుండా అడ్డుపడ్డ కొందరు నేతలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారని కవిత వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ పనితీరుపై నేతలు అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని తాజా పలువురు మాజీ ఎమ్మెల్యేల పై పరోక్షంగా కామెంట్స్ చేశారు కవిత. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో ఓడిపోయాము అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. నిజామాబాదులో ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇవ్వాలన్నారు.

ఇదిలా ఉంటే.. బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ఈ మేరకు కవిత ‘ఎక్స్’ లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు. కాగా, బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Exit mobile version