NTV Telugu Site icon

MLC Kavitha : కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకం

Mlc Kavitha

Mlc Kavitha

మధ్య ప్రదేశ్ లో పీడిత్ అధికార్ యాత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు కాంగ్రెస్ ఎందుకు న్యాయం చేయలేదని, కేంద్రంలో బీసీలకు ప్రత్యే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీల కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని, ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని చెప్పారు.

 

తెలంగాణను సీఎం కేసీఆర్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 30 లక్షల మందికి ఉద్యోగాలు కలిగేలా చేశారని గుర్తు చేశారు. పెద్ద పరిశ్రమలు లేని కారణంగా చదువుకున్న పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి మధ్య ప్రదేశ్‌లో ఉందని ఈ దుస్థితి మారాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని కవిత దుయ్యబట్టారు. దేశంలో ఓబీసీ(OBC) న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ అడుగుతున్నారని, అది ఎవరి తప్పు? అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్యను ఎందుకు పెంచలేక పోయిందని ఆరోపించారు.

 

Show comments