NTV Telugu Site icon

MLC Kavitha: నేడు జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన!

Mlc Kavitha

Mlc Kavitha

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు పెంబర్తి గ్రామంలోని విశ్వకర్మ హస్తకళల కేంద్రంను కవిత సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేఖ రాజ్‌ను పరామర్శిస్తారు. ఉదయం 11.30కి పెంబర్తి గ్రామ్ పంచాయత్ కార్యాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతారు.

Also Read: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!

పెంబర్తి గ్రామ పర్యటన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనగామ జిల్లా కేంద్రంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకి జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 1.30కి జనగామలో జిల్లా జాగృతి నాయకులు మురళి గృహ ప్రవేశానికి ఆమె హాజరు కానున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు. ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో పెంబర్తి, జనగామలో బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు కూడా బందోబస్త్ ఏర్పాటు చేశారు.