జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ ల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలతో జలాశయాల్లో నీరు నిల్వ ఉండలేక, వరదల సమయం లో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, సీఎం రేవంత్ జంట నాగరాల్లో అక్రమణలా తొలగింపునాకు హైడ్రా ఏర్పాటు చేయడం చైర్మన్ గా సీఎం ఉండడం అభినందనీయన్నారు. బఫర్ జోన్ రక్షణ దిశగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. పర్యావరణ ప్రేమికులు ఈ విధానం పై హర్షం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం చర్యలతో ప్రజల నుండి స్పందన అని ఆయన అన్నారు. జాలాశయాల నిబంధనల పరిరక్షణకు అనుగుణంగా రాష్ట్రంతో పాటు పట్టణాలకు అనుబంధంగా ఉన్న వాటిలో కూడా ఆక్రమణలు పెరిగాయన్నారు. జిల్లా, పట్టణ పరిధిలో కూడా హైడ్రా లాంటి విధానం అమలు చేయాలని, హైడ్రా పరిధి పెంచకపోతే జిల్లా కలెక్టర్ లకు అధికారం ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆక్రమణ నిర్మాణాలు జరగకుండా హద్దులు నిర్ణయించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్నా అని, హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో ప్రభుత్వం అనుమతులు ఇచ్చి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు జీవన్ రెడ్డి.
అంతేకాకుండా..హుసేన్ సాగర్ హైదరాబాద్ నడి బొడ్డున ఉంది. బఫర్ జోన్ నిర్ధారణ బౌండ్రి ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేయాలని ఇది ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న. పిజేఅర్ చెరువుల ఆక్రమణ పై ఉద్యమం, న్యాయ పోరాటం చేశారు. నీరు ఉంటేనే భూగర్భ జలం వృద్ధి చెందుతుంది. సీఎం చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న. పర్యావరణ ప్రేమికులకు ఇదో శుభవార్త. హైడ్రా పరిధి రాష్ట్రం మొత్తం విస్తరణ కు ప్రభుత్వం చొరవచుపాలి. సాధ్యం కాని పక్షంలో కలెక్టర్ లకు తొలగింపునాకు అధికారం ఇవ్వాలన్నా జీవన్ రెడ్డి. అనంతరం విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చడానికి అసెంబ్లీ లో చర్చ పెట్టారని, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న బఫర్ జోన్ పరిధిలో ఉన్న అన్నింటినీ కూల్చి వేయాలని, ఇది అన్ని జిల్లాల వారీగా చర్యలు చేపట్టాలని కోరుతున్నానన్నారు.
Malayalam cinema: సినిమా రంగంలో మహిళలపై వేధింపులు..సిట్ ఏర్పాటు చేసిన కేరళ సర్కార్..
