జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నా ప్రజా జీవితం ప్రారంభించింది ధరూర్ గ్రామం నుండే అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంత ఎపుడు జీవన్ రెడ్డి కి అండగా నిలుస్తుంది, బిఆర్అస్ ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతంపై విశ్వాసం లేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వస్తాయి పోతాయి.. ఎన్నికలలో నేను గెలిచినా అన్ని సార్లు ఎవరు గెలవలేదని ఆయన వ్యాఖ్యానించారు. నేను ఓడినన్ని సార్లు ఎవరు ఓడలేరు… గెలిచినా ఓడిన ప్రజల మధ్య ఉన్నానని ఆయన పేర్కొన్నారు. నేను గెలువలేకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం నా అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. నేను ప్రశ్నించే గొంతుకనే కాకుండా, సమస్యలను పరిష్కరించేవాడిని కూడా అని ఆయన తెలిపారు.
ఒక్క పంట పొతే వ్యవసాయాన్ని ఇడిసిపెడతామా.. అలాగే ఒక్క ఎలక్షన్ పోతే ఇంకో ఎలక్షన్ వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గ్రామ పంచాయతీల నిధులు వస్తాయని స్పష్టం చేశారు. మత్స్యకారుల సహకార సంఘానికి చేపనారు కోసం నేరుగా వారి ఖాతలో డబ్బులు వేసేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని, అందులో ఎలాంటి సందేహం వద్దన్నారు. పింఛన్లను పెంచడంతోపాటు గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. అర్హులందరికీ పథకాలు అందుతాయని వెల్లడించారు.