తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుంతోంది. నిన్న బీజేపీ ఎంపి ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. అయితే.. ఈ దాడి అనంతరం ఎమ్మెల్సీ కవిత సైతం ఎంపీ అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చెప్పుతో కొడతానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అర్వింద్ ఎక్కడా పోటీ చేసిన అక్కడ పోటీ చేసి ఓడిస్తానని ఆమె వ్యాఖ్యానించారు. ఈ దాడి ఘటనను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ విమర్శలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా తన ఇంటిపై దాడిన ఖండిస్తూ ఎంపీ అర్వింద్ ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు. తనపై పోటీ చేసి గెలస్తానన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తూ.. పోటీకి సిద్ధమన్నారు అర్వింద్.
Also Read : Yanamala Ramakrishnudu: ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. చంద్రబాబు వెంటనే అభ్యర్థులను ఖరారు చేయాలి..!
అదే సమయంలో.. కవిత ఓడిపోవడానికి ఆమె వెంట ఉన్న ఎమ్మెల్యేలే కారణమని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందిస్తూ.. గత పార్లమెంటు ఎన్నికల్లో కవితకు ఆమె సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారంటూ విమర్శించారు. కవితి గెలిస్తే తమపై ఆధిపత్యం చేస్తుందని భావించిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఆమె ఓటమికి ప్రణాళికలు చేశారన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల చేత నామినేషన్ వేయించింది బీజేపీనే అని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు వేయిస్తే వారు బీజేపీలో ఎందుకు చేరుతారని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.