జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్భాటాలు చేయడంతో అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమయానుకూలంగా ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా అధికారులతో మాట్లాడితే తూకం వేస్తామనీ చెప్పడమే కానీ ప్రారంభించిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. నాలుగున్నర ఏళ్లు గడుస్తున్న ఇంతవరకు రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. 8 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులకు పంట నష్టం పరిహారం అందడం లేదని ఆయన మండిపడ్డారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని సీఎం ప్రకటించినా, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Also Read : India Military Expenditure: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రక్షణ వ్యయదారుగా ఇండియా..
ఇదిలా ఉంటే. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. లౌకిక వాదానికి భిన్నంగా ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన దానికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదప లేదని మండిపడ్డారు. కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రం నష్టపోతుందని పేర్కొన్నారు.
Also Read : Cyber Fraud: టికెట్ డబ్బులు రీఫండ్ చేయాలనుకుంటే.. రూ. 5 లక్షలు గోవిందా..
