NTV Telugu Site icon

MLC Jeevan Reddy : ఉద్యమ ఆకాంక్షలు ఏం నెరవేరాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి

Jeevan Reddy

Jeevan Reddy

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది దినోత్సవాల సందర్భంగా సంబరాలు చేసుకోవడం కాదు ప్రభుత్వాన్ని సమర్థతతో నడిపివ్వాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మారం మండలం స్తంభంపల్లిలో విత్తనాలు ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ఆయన మండిపడ్డారు. స్తంభంపల్లిలో ఇతర ఫ్యాక్టరీ పెట్టడం కాదు రైతుల కోసం చక్కెర ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. స్తంభంపల్లిలో ఇథనాలు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయం ప్రధానమన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరిట అధికార పార్టీ ఆర్భాటాలు చేయడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Call Money Case: విజయనగరంలో బయటపడ్డ కాల్ మనీ కేసు..మరీ ఇంత అరాచకమా?

ఉద్యమ ఆకాంక్షలు ఏమి నెరవేరాయో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రము ఏర్పడిన తర్వాత 60 వేల కోట్ల అప్పు ఇప్పుడు 5 లక్షల 60 వేల కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. జగన్‌తో ఒప్పందము చేసుకొని ఉండాలి లేదా వైఫల్యం చెంది ఉండాలని ఆయన అన్నారు. 2022 23 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 10 వంద మంది దళితులకు 15,700 కోట్ల బడ్జెట్ శాసనసభలో ఆమోదం పొందిన ప్రభుత్వము ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, గడిచిన నాలుగు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వని రాష్ట్రము దేశంలో తెలంగాణ ఒకటేనన్నారు. ఇన్ని వైఫల్యాలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాలు ఎవరికోసం చేస్తుందో ఏం సాధించిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

Also Read : Mission Bhagiratha : మిషిన్ భగీరథ కార్యాలయం వద్ద ఇంట్రా కాంట్రాక్టర్ల ధర్నా