NTV Telugu Site icon

MLC Jeevan Reddy : దళితులకు చెందాల్సిన 40 వేల కోట్లను కేసీఆర్‌ పక్కదారి పట్టించిండు

Jeevan Reddy

Jeevan Reddy

రాయికల్ మండలం ఇటిక్యాలలో గ్రామంలో కాంగ్రెస్ కార్యాలయంను ప్రారంభించి అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మస్కట్ పోయేటోళ్లనే పాస్ పోర్టుల పేరుతో మోసం చేసిన వ్యక్తి దళితబంధు ఇస్తాడని ఎలా నమ్ముతాం..? అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్, నేను కలిసి చదువుకున్నాం, నాకు ఆయన గురించి బాగా తెలుసు అని ఆయన వెల్లడించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, ఇల్లు కట్టించడం వంటి హామీలు తుంగలో తొక్కిండని ఆయన విమర్శించారు. అంతేకాదు, అంబేద్కర్ దయతో రాజ్యాంగపరంగా దళితులకు చెందాల్సిన 40 వేల కోట్ల ఎస్సీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ ను కూడా పక్కదారి పట్టించిండని జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా దళితులు ఆలోచించాలన్నారు జీవన్‌ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయని, ఉద్యోగాలు లభిస్తాయని ఆశించిన యువతకు నిరాశే మిగిలిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రేషన్ కార్డు మీద 9 రకాల నిత్యావసర సరుకులు అందించామని, కేసీఆర్ బియ్యం తప్పా అన్ని రద్దు చేసిండన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, తమను ఆదరించి, ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

Also Read : Minister KTR: తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి..

సింగరేణికి కేటాయించిన గనుల్లో బొగ్గు తీయకపోవడం, గనులను విస్తరించకపోవడంతో కార్మికుల సంఖ్య 60 వేల నుంచి 43 వేలకు తగ్గిపోయిందన్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రం ప్రైవేట్ పరం చేయదని పేర్కొన్నారు. ఒకప్పుడు 35,000 కోట్ల డిపాజిట్లు ఉన్న సింగరేణి ఇప్పుడు అప్పుల్లో ఉందని విమర్శించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ చర్చ లేకుండా ఉండేందుకే టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీని తెరమీదికి తెచ్చారని, కానీ అసలు సమస్య టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీయేనని అన్నారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుట్రదారులేనని ఆరోపించారు.

Also Read : Jagadish Reddy: తెలంగాణలో ఎకరం అమ్మి.. ఆంధ్రలో 100 ఎకరాలు కొనొచ్చు..

Show comments