Site icon NTV Telugu

MLC Jeevan Reddy : సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో

Jeevan Reddy

Jeevan Reddy

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బిజెపి మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తాం అనడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. మోడీకి ఆదాని, అంబానీ అండ రాహుల్ గాంధి కి ఎవరు ఉన్నారని, దేశ సమగ్రత, దేశ ఐక్యతను కాపాడింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసింది ఇందిరాగాంధీ అని, రైతుల కు మద్దతు ధర కల్పించాలని కొరితే హిందుత్వ వ్యతిరేకమా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రతిష్ట రోజురోజుకి దిగజారి పోతుందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ లో జగిత్యాల నియోజకవర్గం, అంతర్భాగమని..అందుకే నిజామాబాద్ ఎంచుకున్నానని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ అయితే జగిత్యాల అభివృద్ధి చేసుకునే చాన్స్ ఉంటుందన్నారు. ఎంపీగా గెలిచిన వెంటనే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని చెప్పారు.

 

Exit mobile version