జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో ఫిల్టర్ బెడ్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ కి ఉన్న అవగాహన ఏమిటో తెల్సుకోవాలి.. కల్వకుంట్ల తారకరామరావు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలని నెమరువేస్కో అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి కోరుకో ప్రభుత్వనికి సహకరించు కేటీఆర్ అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత మీదేనంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Salaar : సలార్ మూవీకి ‘A’ సర్టిఫికెట్ రావడానికి కారణం అదేనా..?
రాష్ట్రన్ని నిండా అప్పుల్లో ముంచారు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నీవ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు కేటీఆర్ మేము గతంలో ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉంది.. ఆదాయం సమాకుర్చీకోవడనికి.. మీ ప్రభుత్వం గతంలో తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసను చేశారు.. రాష్ట్రాన్ని మద్యం నుంచి విముక్తి కలిపిస్తాం బెల్ట్ షాప్ లను ఎత్తేస్తాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతుంది.. ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు.