పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “సలార్ సీజ్ ఫైర్ 1”. ఈ మూవీ డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే సలార్ మూవీ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.అయితే ఈ మధ్యే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.హింస మరియు అశ్లీలత ఎక్కువగా ఉన్న సినిమాలకు సాధారణంగా సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తుంది. అంటే ఇలాంటి సినిమాలను థియేటర్లలో కేవలం 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే చూసే వీలుంటుంది.ఇండియా టుడేతో మాట్లాడిన సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్.. సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ కోసం తాము ఎంతగానో ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు.సెన్సార్ నిబంధనల్లో వచ్చిన భారీ మార్పులు కారణంగానే తమ సినిమాకు ఇలా ‘ఎ’సర్టిఫికెట్ వచ్చినట్లు ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్ తెలిపారు. ఈ మూవీలో అశ్లీలం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
సలార్ మూవీకి సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చిందో విజయ్ కిరగండూర్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.. “మేము యూ/ఎ సర్టిఫికెట్ కోసమే ప్రయత్నించాం. ఎందుకంటే మా సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడాలని అనుకున్నాం. అయితే ఇప్పుడు ‘ఎ’ సర్టిఫికెట్ తో కూడా మేము సంతృప్తిగానే ఉన్నాం. సెన్సార్ రూల్స్ మారిపోయాయని బోర్డు సభ్యులు కారణాన్ని వివరించే ప్రయత్నం చేశారు.యానిమల్ మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. సెన్సార్ అధికారులను కలిసినప్పుడు కొన్ని కట్స్ చేస్తే యూ/ఎ సర్టిఫికెట్ ఇస్తామని వారు చెప్పారు. కానీ దానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంగీకరించలేదు. ఓ హింసా ప్రవృత్తి కలిగిన వ్యక్తి అలా ఎందుకు మారాడన్నది చెప్పడానికి ఆ సీన్స్ సినిమాకు ఎంతో ముఖ్యం” అని ప్రొడ్యూసర్ విజయ్ తెలిపారు.ఇక సలార్ మూవీలో ఎలాంటి అశ్లీలత సన్నివేశాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు..ఈ సినిమాకి యాక్షన్ సీక్వెన్స్ వల్ల ‘ఎ’సర్టిఫికెట్ ఇచ్చినట్లు విజయ్ కిరగండూర్ తెలిపారు.