NTV Telugu Site icon

Kishan Reddy : స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలి

Kishan

Kishan

Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసినా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలి” అనే నినాదంతో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుందని తెలిపారు కిషన్ రెడ్డి.

కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామ పంచాయితీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏమాత్రం చేయలేకపోయాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ రాకుండా ఈ రెండు పార్టీలపై పోరాటం చేయాలని ఆయన బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ బలపడాలని, రాష్ట్ర సమస్యలపై పోరాడాలని, అధికారంలోకి రావాలని ప్రజలు చూస్తున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు.

Telangana Rice to Philippines: కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం..