Congress: 100 రోజుల పరిపాలన పై ప్రజలు పండుగ చేసుకోవాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన చేయడంలో విఫలమైంది.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల భరోసా కపడేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది.. కాబినెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు స్థానం కలిపించింది.. ఒక దళితుడిని డిప్యూటీ సీఎం చేసి గౌరవించింది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి సీఎం, డిప్యూటీ సీఎం రెండుకళ్ళు లాగా పరిపాలన కొనసాగుతుంది.. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన 9 ఏళ్ళు పోరాడినందుకు వారి పక్షాన నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు.. ఇచ్చిన ప్రతి స్కీం అమలు చేసే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంది అని బల్మూరి వెంకట్ అన్నారు.
Read Also: MS Dhoni-IPL 2024: ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్.. మోకాళ్లు అరిగిపోతున్నప్పటికీ..!
పేద ప్రజల వైద్యం కోసం ఆరోగ్య శ్రీ కింద 10 లక్షలకు పెంచింది అని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదలు పెట్టింది.. 3 కోట్ల మహిళలు ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణం చేశారు.. 200 ఉచిత విద్యుత్తు అమలు చేస్తుంది.. 500 రూపాయలకే గ్యాస్.. చెప్పిన్నట్లే రైతు భరోసా ఇస్తున్నాము.. ఇందిరమ్మ ఇళ్ల ఇవ్వడానికి కూడా ప్రభుత్వం స్వీకారం చుట్టింది.. నిరుద్యోగులకు చెప్పిన్నట్లే ఉద్యోగాలు ఇస్తున్నాము.. మెగా డీఎస్సీ ఇచ్చాం.. గ్రూప్- 1, 2,3 పోస్ట్ లు ఇచ్చాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు టెట్ కూడా డీఎస్సీ కంటే ముందే నిర్వహించే విధంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది.. జీవో 46పై కమిటీ వేసింది.. ఇలా ప్రభుత్వం చెప్పిన్నవి చేస్తుంది.. ఇది నిజమైన ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తోంది.. 100 రోజులో రోజుకో సమస్య పారిష్కరించింది.. ప్రతిపక్ష పార్టీలు ఇది ఓర్వలేక ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు అంటూ ఎమ్మెల్సీ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Viral Video: ఆశ్చర్యపోయేలా రిక్షా కార్మికులు చేసిన జుగాడ్..!
మాజీ సీఎం కేసీఆర్ చిట్ చాట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మాజీ సీఎం ప్రజల వద్దకు వస్తే 100 రోజుల పరిపాలన పై ప్రజలే మీకు సమాధానం చెప్తారు.. మా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలని నెరవేరుస్తుంది.. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.. చెప్పినవే కాదు చెప్పనవి కూడా చేస్తాము.. 420 గాళ్ళు మా గురించి ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకొము అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉందన్నారు. కచ్చితంగా ప్రభుత్వం చెప్పినవని అమలు చేస్తోంది.. ప్రజలు ప్రతిపక్షాల మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పుకొచ్చారు.