Site icon NTV Telugu

Addanki Dayakar: విచారణ కమిషన్ శీలాన్ని శంకించవలసిన పనిలేదు.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు..!

Addanki Dayakar

Addanki Dayakar

Addanki Dayakar: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం లో తప్పులు జరిగాయనే కారణంతోనే కమిషన్ కొంత సమయం తీసుకుని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతి చెందిన బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్‌లో వివక్షకు అవకాశం లేదు. వివేక్, వంశీలపై ఎలాంటి వివక్ష లేదని పేర్కొన్నారు.

Read Also: Gulzar House Fire Incident: దాని వల్లే గుల్జార్ హౌస్ ప్రమాదం.. నిర్ధారించిన అధికారులు..!

కాళేశ్వరం విచారణలో కేసీఆర్, ఈటెల, హరీష్ రావులపై ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడం ముఖ్యమైన పరిణామంగా అభివర్ణించారు. వారు తప్పు చేయలేదంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటీ? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో తప్పు జరిగిన విషయాన్ని కమిషన్ తేల్చిందని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విచారణ కమిషన్ శీలాన్ని శంకించాల్సిన అవసరం లేదు.. సాంకేతిక సమాచారం కోసం ఆలస్యం జరిగిందని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే, శిక్ష తప్పదని.. కేసీఆర్ అమెరికా పారిపోవాలని చూస్తున్నట్టున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి పని చేయొద్దని, ప్రభాకర్ రావు వెళ్లినట్టు మీరు పోకండని హెచ్చరించారు. అలాగే కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయడానికి కాదు, క్యాష్ లిఫ్టింగ్ చేయడానికే వాడుకున్నారు. తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చారు అంటూ మండిపడ్డారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఒక్క పిల్లర్ అయినా కూలిందా? కానీ కన్నెపల్లె పంపు హౌస్ ఎందుకు మునిగింది? అని నిలదీశారు.

Read Also: Tata Harrier EV: కిరాక్ లుక్‌లో జూన్ 3న లాంచ్‌కు సిద్దమైన టాటా హారియర్ EV..!

మరోవైపు ఈటెలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఈటెలను బీజేపీలోకి కావాలనే పంపించారా కేసీఆర్? బీఆర్ఎస్ లో అక్రమాలు చేసిన తర్వాతే ఆయన పార్టీ మారారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సీల్డ్ కవర్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాగే కిషన్ రెడ్డి లాంటి బానిసలతోనే దేశానికి నష్టం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ల పట్ల బీజేపీకి విధానం లేదని, రాహుల్ గాంధీ మీద మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని ఆయన అన్నారు. బీజేపీ నేతలు ఎవరైనా దేశ స్వాతంత్రంలో పాల్గొన్నారా..? అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ కు సమాచారం ఇచ్చిన కేంద్ర మంత్రి దేశ ద్రోహి కాదా..? కిషన్ రెడ్డి నల్లి కుట్ల లెక్క ఉంటాడని ఘాటు వ్యాఖ్యలు చేసారు. బీజేపీ కాదు.. బూతు జనతా పార్టీ, నీఛాతి నీచమైన బాషా.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆయన అన్నారు.

Exit mobile version