మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సింగిల్ బెంచ్ సీబీఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందని తెలంగాణ సర్కార్ తరుఫున దుష్యంత్ దవే ఇప్పటికే వాదనలు వినిపించారు. అయితే.. తాజాగా నేడు తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. అయితే.. ఈ నేపథ్యంలో.. ఈ కేసును సీబీఐకి అప్పగించవద్దని ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కేసులు నమోదు అయినప్పుడు రాజకీయ పరంగా విమర్శలు సర్వసాధారణమని, ఢిల్లీ లిక్కర్ స్కాం కేస్ లోనూ ఆప్ నేతలపై బీజేపీ విమర్శలు చేసిందని అన్నారు దుష్యంత్ దవే. ప్రతి విమర్శను టీవీలు చూపిస్తున్నాయని దుష్యంత్ దవే అనడంతో.. మేము టీవీలు చూడటం ఎప్పుడో మానేసామన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read : BRS First Public Meeting Live: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
దీంతో.. సిట్ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని, సిట్‌లో ఉన్న ఐపీఎస్ లపై ఎటువంటి ఆరోపణలు లేవని, గతంలో వివిధ కేసుల్లో సుప్రీం కోర్టు జడ్జిమెంట్లలో సిట్ లో ఒక ఐపీఎస్ ఉంటే బావుండేదనీ సుప్రీం కోర్టు వాఖ్యాన్నించిందని దుష్యంత్ దవే వివరించారు. ముఖ్య మంత్రి ప్రెస్ మీట్ ను కేంద్రంగా చూపి దర్యాప్తు సంస్థ ను మార్చేస్తారా ? ఇది ఒక ట్రాప్ కేస్ అని సింగిల్ జడ్జి మర్చిపోయారు. నిందితులు ఫార్మ్ హౌస్ కి వచ్చింది వాస్తవం కాదా అని దుష్యంత్ దవే అన్నారు. డబ్బు, పదవులు ఎర చూపి ఎం ఎల్ ఏ లను కొనుగోలు చేయాలనుకుంది వాస్తవం కాదా అని, నిందితులు మాట్లాడింది అంతా ఎలక్ట్రానిక్ పరికరాలలో రికార్డ్ అయ్యిందని, డేటా మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్ లో బయట పడిందన్నారు దుష్యంత్ దవే. అయితే.. ఇప్పటికే ప్రతివాదుల వాదనలు ముగియడంతో.. హైకోర్టు ప్రభుత్వం పిటిషనపై చేపట్టిన విచారణపై తీర్పు రిజర్వ్ చేసింది. అలాగే.. లిఖితపూర్వక వాదనలు ఈనెల 30 లోపు సమర్పించాలని ధర్మాసనం కోరింది.
Also Read : Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు
