NTV Telugu Site icon

MLAs Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. నేడు సెక్రటరీ తరఫున కొనసాగనున్న వాదనలు!

Supreme Court

Supreme Court

నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపు వాదనలు ముగిశాయి. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు కొనసాగనున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున వాదనలను సుప్రీంకోర్టు రికార్డు చేయనుంది.

Also Read: Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్‌ సంచలన నిర్ణయం!

బుధవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నాలుగేళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. తమ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా.. స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ చేస్తోంది.