NTV Telugu Site icon

MLA Vivekananda Goud : రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది

Mla Vivekananda

Mla Vivekananda

రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని వివేకానంద గౌడ్ విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంత షాడో మంత్రుల దందా నడుస్తుందని, కోవర్టు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. సుంకిశాల ప్రమాదం పై బీఆర్‌ఎస్‌ పార్టీ పలు ప్రశ్నలను ప్రభుత్వం ముందు ఉంచిందని, సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనలో ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. నిర్మాణం సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశామన్నారు వివేకానంద. ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిందని, స్టేట్ లో ప్రభుత్వం కంటే సోషల్ మీడియా వేగవంతంగా పని చేస్తోందన్నారు. ప్రమాదం పై మంత్రుల మాటలకు పొంతన లేదని, పెద్ద విపత్తు జరిగింది నష్టం వాటిల్లింది కేంద్ర మంత్రి, బీజేపీ నేతలు దీనిపైన మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఫైనాన్స్ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయి వీటిపైన మాట్లాడరని, బిల్లుల జారీ అంశంలో 7 శాతం ఒకచోట , 1 శాతం మరో చోట అంటూ దోచుకుంటున్నారన్నారు. స్కూల్ విద్యార్థులు మరణిస్తే.. బీజేపీ నేతలు దీని పైన మాట్లాడరని ఆయన మండిపడ్డారు.

St Martin’s Island: షేక్ హసీనాని గద్దె దించిన ‘‘ద్వీపం’’.. అమెరికాకి సెయింట్ మార్టిన్స్‌పై ఆసక్తి ఎందుకు..?

అంతేకాకుండా..’లా అండ్ అడర్ రాష్ట్రంలో గాడి తప్పింది దీనిపైన బిజెపి నోరు విప్పది. కుక్కలు దాడులు చేస్తున్నాయి వీటిపైన కేంద్ర మంత్రులు ,బిజెపి నేతలు మాట్లాడరు. బండి సంజయ్ కేటీఆర్ పై మాట్లాడిన మాటలపై ప్రధానికి, కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాస్తున్నాం. రాజ్యాంగం పట్ల అవగాహన లేనట్టు బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఢిల్లీలో కుస్తీ బస్తీలో దోస్తీ లాగా రెండు జాతీయ పార్టీల తీరు ఉంది. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా కాదు రేవంత్ కు సహాయ మంత్రిగా బండి సంజయ్ పని చేస్తున్నారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉండి కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని కామెంట్స్ చేస్తారా! పరిధి దాటి చిల్లర మాటలు మాట్లాడిన బండి సంజయ్ పై కేంద్రాన్ని వివరణ అడుగుతాం.’ అని వివేకానంద వ్యాఖ్యానించారు.

Saripodhaa Sanivaaram Trailor: భగభగభగ.. భగభగమని.. మాస్ పోస్టర్ తో ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్..