NTV Telugu Site icon

MLA Vinay Bhaskar : తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదు, లాక్కున్నాం, గుంజుకున్నాం

Vinay Wgl

Vinay Wgl

వరంగల్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. రాహూల్ గాంధీ నిన్న ఖమ్మం సభలో మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలను అవమాన పరిచే విధంగా, మోసం చేసే విధంగా ఉన్నాయని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. జాతీయ అధ్యక్షుడు కావాలంటే భయపడి పారిపోయిన నాయకుడు రాహుల్ గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయి నాయకునికి కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. జాతీయ పార్టీలకు ఓకే విధానం ఉండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు, దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్ప అబ్బురపరిచే ప్రాజెక్ట్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇప్పటివరకు పెట్టిన ఖర్చు 80వేల కోట్లు మాత్రమే అన్నారు.

Also Read : Boyapati : బాలయ్యతో బోయపాటి సినిమా ఇప్పట్లో లేనట్లేగా..?

అంతేకాకుండా.. ‘ 80వేల కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. చేయూత ద్వారా పెన్షన్ ను నాలుగు వేలు చేస్తానన్నారు. కర్ణాటకలో 800రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. చేయూత పెన్షన్ ప్రకటన ఎన్నికల కోసం చేసినది. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదు, లాక్కున్నాం, గుంజుకున్నాం. అవినీతికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్కాంలను పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏటీమ్ బీఆర్ఎస్, తెలంగాణలో ఒకే ఒక్క బాహుబలి కేసీఆర్. మళ్ళీ అధికారంలోకి వచ్చేది కుడా బీఆర్ఎస్. ఉత్తరకుమారా ప్రగల్భాలు పలుకుడు మానుకోవాలి. మంత్రి కిషన్ రెడ్డిని చూస్తుంటే జాలి అనిపిస్తుంది. పాలపొంగు లాగా వచ్చిన బీజేపీ సప్పున చల్లారింది. బీజేపీ సింగిల్ డిజిట్ కు పరిమితం, రెండు, మూడు సీట్లకు మించి బీజేపీ గెలువదు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటేనే మాకు మంచింది. బండి సంజయ్ మాట్లాడే భాష, ఆహాభావాలు తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ములుగులో గిరిజన యూనివర్శిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది.

గిరిజన యూనివర్శిటీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా గిరిజన యూనివర్శిటీ బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలి. తెలంగాణపైన వివక్ష చిపిస్తు అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ తెలంగాణపైన ప్రేమ వలకబొస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన నాయకులు చవటలు, దద్దమ్మలు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా?. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ కు ఈ వివక్ష కనిపించట్లేదా?. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలని అనేక ఏళ్లుగా ఉద్యమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని పెట్టారు. పిరాడికల్ ఒరైలింగ్ యూనిట్ ఇస్తామని అంటున్నారు.

బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. వరంగల్ కు అన్యాయం చేసిన బీజేపీకి సభ పెట్టే అర్హత లేదు. తెలంగాణకు ఇచ్చిన నిధులు, గుజరాత్ కు ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు కిషన్ రెడ్డి సిద్దమా?. చర్చకు సిద్దం కాకుంటే వరంగల్ లో సభ పెట్టే అర్హత లేదు. బహిరంగ సభలు పేరుతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదో రకంగా మభ్య పెట్టేందుకు ఈ రెండు పార్టీలు వస్తున్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్’ అని ఆయన వ్యాఖ్యానించారు.