NTV Telugu Site icon

MLA Vinay Bhaskar : చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయండి

Dasyam Vinay Bhaskar

Dasyam Vinay Bhaskar

వరంగల్ జిల్లా కాజీపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలపై వరంగల్ కు వచ్చే ప్రధాని మోడీ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు డివిజన్ గా మార్చే విషయంపై మోడీ ప్రకటన చేయాలని ఆయన అన్నారు. లేకుంటే బీఆర్ఎస్ కు పోరాటాలు కొత్తకాదని ఆయన వెల్లడించారు. కలిసివచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడుతామన్నారు. తెలంగాణలో మోడీ ఈడీ వ్యవహారం సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల నేపథ్యంలోనే మోడీ వరంగల్ కు వస్తున్నారని ఆయన అన్నారు. మోడీ వచ్చిపోయాక నవంబర్ లో ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయండని వినయ్ భాస్కర్ డిమాండ్‌ చేశారు.

Also Read : Tillu Square: పాపం… ఏ డేట్ అనౌన్స్ చేసినా వాళ్లు వదలడం లేదుగా!

రాజకీయం చేస్తూ గ్రూపు రాజకీయాలు మానుకోవాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ప్రజలను మోసం చేసే కుట్ర చేస్తోంది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. రైల్ వ్యాగన్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం స్వాగతిస్తున్నామని, బీఆర్‌ఎస్‌ ఒత్తిడి ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారన్నారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు ఉద్యమం చేస్తామని, బీజేపీ నేతలకు, కేంద్ర మంత్రి చిత్త శుద్ది ఉంటే ఈ నెల 8 న కేంద్ర ప్రధాన మంత్రితో కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన చేయించాలన్నారు. విభజన చట్టం లో పొందు పరిచిన హామీలు అమలు చేయడంతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని ఆయన అన్నారు.

Also Read : Vikarabad Murder Case : సినిమా రేంజ్‌లో హత్య.. చివరికి