NTV Telugu Site icon

MLA Sunke Ravi Shankar : అబద్ధాలు ఆడటం బండి సంజయ్ మానుకోవాలి

Ravi Shankar Mla

Ravi Shankar Mla

బండి సంజయ్ నువ్వు రైతుల పరామర్శకు వెళ్ళినవా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని తిట్టడానికి వెళ్ళినవా అని ప్రశ్నించారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఇవాళ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. దీంతో బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌ మాట్లాడుతూ. చేతకాని దద్దమ్మ బండి సంజయ్ అని నిప్పులు చెరిగారు. గత నెలలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శించని దద్దమ్మ బండి సంజయ్ అని ఆయన మండిపడ్డారు. గతంలో వర్షాలకు నష్టపోయిన నివేదికలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Viral Video: చీర కోసం జుట్లుపట్టుకుని కొట్టుకున్న లేడీస్‌.. డిస్కౌంట్‌ సేల్‌లో ఘటన

అబద్ధాలు ఆడటం బండి సంజయ్ మానుకోవాలని ఆయన హితవు పలికారు. బండి సంజయ్ దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం తరఫున తక్షణమే 1000 కోట్ల సహాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లాలో 9500 మంది రైతులకు 8కోట్ల 16లక్షల రూపాయల నష్టపరిహారం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, చొప్పదండి నియోజకవర్గంలో గత వడగండ్ల వానలకు నష్టపోయిన 4000 మంది రైతులు 3500 ఎకరాలకు 3 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఎకరానికి 20000 తీసుకురా అని ఆయన సవాల్‌ విసిరారు.

బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలే లేవని, దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతుల కోసం నిర్మించిన రైతు కల్లాల నిధులను 150 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వాపస్ తీసుకుంది.దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. గత నెలలో వడగండ్ల వర్షాల సమయంలో పంటలు ఇంకా కోతకు కూడా రాలేదని, కానీ బండి సంజయ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదనడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.

Also Read : Upasana: మెగా కోడలి సీమంతం చేసిన ఆడపడుచులు.. భలే ఉన్నారే

ఎరువులు,విత్తనాల ధరలు పెంచింది బిజెపి కేంద్ర ప్రభుత్వమని, రైతులు దేశ రాజధాని ఢిల్లీలో మద్దతు ధరల గురించి ధర్నా చేస్తే లాఠీ ఛార్జ్, బాష్పవాయువు గోలాలతో,రబ్బరు బుల్లెట్లతో చంపించిన ఘణుడు మోడీ అని ఆయన అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. వడగండ్ల వాన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.