NTV Telugu Site icon

MLA Sunke Ravi : హిందువులం అని బండి సంజయ్ పబ్బం గడుపుతున్నారు

Mla Sunke Ravi Shankar 1024x576

Mla Sunke Ravi Shankar 1024x576

దేవుడి పేరుతో రాజకీయాలు చేసేది బండి సంజయ్, బీజేపీ అని మండిపడ్డారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జై శ్రీరామ్ అనే నినాదం అందరి సొత్తు, బీజేపీ పార్టీ ఒక్కరి నినాదం కాదని ఆయన అన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఅర్ అభివృద్ధి చేస్తున్నాడని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ ఆరోపించారు. దేవుళ్లను మోసం చేస్తుంది బీఆర్ఎస్ కాదు బీజేపీ అని మండిపడ్డారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌. హిందువులం అని బండి సంజయ్ పబ్బం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌.

Also Read : Helicopter Crash: అలబామాలో కుప్పకూలిన యూఎస్‌ మిలిటరీ హెలికాప్టర్.. ఇద్దరు మృతి

తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ అన్నారు. మతం పేరుతో యువతను ఉన్మాదులుగా మారుస్తుంది బీజేపీ అని, బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భూదందా అని మాట్లాడుతున్నారని, కొండగట్టు మీదా ఎక్కడ భూములు ఉన్నాయో చూపాలని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ డిమాండ్‌ చేశారు. అయోధ్యను ఇంతవరకు నిర్మాణం చేయలేదు.. చందాలు వసూలు చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. ఎన్నికల కోసం కాదు దేవాలయాల అభివృద్ధి కోసం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Stray Dog: పరిమళించిన మానవత్వం.. బావిలో పడిన వీధికుక్కకు వారం రోజులుగా ఆహారం