Site icon NTV Telugu

MLA Shanampudi Saidireddy : ఏపీలో అన్ని పార్టీలు మోడీ పార్టీలుగా మారాయి

Shanampudi Saidi Reddy

Shanampudi Saidi Reddy

మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి అన్నారు ఎమ్మెల్య శానంపూడి సైదిరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు దేశంలో అందరు మంత్రులకు ఆదర్శమని ఆయన కొనియాడారు. ఏపీలో ఎవరిని అడిగినా హరీష్ రావు గురించి చెబుతారని, హరీష్ రావు నడిచే యంత్రం, ఓ రోబో లాంటి వారని పేరుందన్నారు. ఏపీ మంత్రి అప్పల రాజు చీదర అప్పలరాజు గా మారారని, ఏపీలో అన్ని పార్టీలు మోడీ పార్టీ లుగా మారాయన్నారు సైదిరెడ్డి. హరీష్ రావు లాంటి వారి మీద మాట్లాడేపుడు వంద సార్లు ఆలోచించుకోవాలని, తీరు మార్చుకోకపోతే ఏపీ ప్రజలు అక్కడి మంత్రుల మీద ఉమ్మేస్తారన్నారు. అభివృద్ధి ఎక్కడ ఎక్కువవుతుందో చర్చకు సిద్ధమని, మా ఆత్మ గౌరవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ, ఏపీ ల అభివృద్ధి పై నాతో ఏపీ మంత్రులు చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు.

Also Read : Botsa Satyanarayana: హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి

హరీష్ రావును మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా చర్చలో ఎదుర్కోలేదని, హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని ఆయన అన్నారు. కేసీఆర్ ఒకే ఒక ఎత్తుగడ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపిందని, 800 రోజులు కార్మికులు ఆందోళన చేసినా కేంద్రం దిగిరాలేదన్నారు. మాతో అభివృద్ధిలో పోటీ పడండని, కేసీఆర్ అభివృద్ధి గురించి తప్ప దేని గురించి మాట్లాడరని ఆయన తెలిపారు. ఏపీ మంత్రులు అభివృద్ధి తప్ప అన్నీ మాట్లాడుతున్నారని, చంద్రబాబు, జగన్ ఎవరూ ఢిల్లీ వెళ్లినా తమ స్వార్ధం కోసం వెళతారని, తెలంగాణ అభివృద్ధి మోడల్ ని ఏపీ అనుసరించాలన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలి అనేదే మా తపన అని, దేశం కూడా బాగుండాలని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు

Exit mobile version