Site icon NTV Telugu

MLA Seethakka : గురుకుల పాఠశాలల్లో ఎక్కడ చూసినా.. వ్యర్థ పదార్థాలే

Mla Seethakka

Mla Seethakka

వికారాబాద్ జిల్లా పరిగి విద్య అరణపురి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. సభలో ఉపన్యాసాలు కాదు పరిగి లోని గురుకుల పాఠశాలను ఒకసారి తనిఖీ చేసి చూడండి అంటూ ఆమె టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి హితవు పలికారు. సరైన వసతులు లేవని, ఎక్కడ చూసినా వ్యర్థ పదార్థాలే దర్శనిమిస్తు్న్నాయని ఆమె మండిపడ్డారు. కనీసం పడుకునే రూములలో కిటికీలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక విద్యార్థికి 36 రూపాయలు సరిపోవని, గురుకుల విద్యార్థులను చదివించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. గురుకుల పనితీరుపై మంత్రులతో రివ్యూ పెట్టి గురుకులాలకు అన్ని సౌకర్యాలు వచ్చేలా చూడాలని, 500 మంది విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు లేవని, అన్నంలో కప్పరావడం పై నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. గురుకులాలో విద్యను దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.

 

Exit mobile version