MLA Rapaka Vara Prasad: టికెట్ విషయం వచ్చే టప్పటికి అధిష్టానమే ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంటుంది.. తాను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నా చేస్తాను, ఎంపీకి వెళ్లమన్నా వెళ్తాను.. అంతిమ లక్ష్యం మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కావాలనేది నా ఉద్దేశం అన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొదట నుండి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉద్యేశంతో పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు గాని, బస్సు యాత్ర గానీ, ఇతర మీటింగ్స్ కానీ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ మధ్య కాలంలో టీడీపీ నుండి గొల్లపల్లి సూర్యారావుని వైసీపీలో జాయిన్ చేసుకోవడం జరిగింది.. ఆయన చేరికను నేను స్వాగతిస్తూ ఉన్నాను అన్నారు.. అయితే, టికెట్ విషయంలో నిర్ణయం అధిష్టానానిదే అని స్పష్టం చేశారు.. కానీ, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడిపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి.. రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం అన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్