Site icon NTV Telugu

MLA Rajaiah: కడియం శ్రీహరిపై ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య

Rajayya

Rajayya

స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటునే ఉన్నారు. అయితే, మరోసారి కడియం శ్రీహరి పైనా ఎమ్మెల్యే రాజయ్య ఘాటు విమర్శలు చేశారు. జఫర్గడ్ మండల్ హిమ్మత్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై రాజయ్య విమర్శలు గుప్పించారు.

Read Also: Rishab Shetty: రిష‌బ్ శెట్టి పుట్టినరోజు.. స‌తీమ‌ణి ప్ర‌గ‌తిశెట్టి కీలక ప్రకటన

నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ ఆరుద్ర పురుగు లాగా కడియం శ్రీహరి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఘన్ పూర్ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఇంటి కిటికీలకు గోనె సంచులు ఉండే.. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన ప్రశ్నించారు. నీతిమంతుండని మాట్లాడుతున్నావు.. నేతి బీరకాయలో నేతి ఎంతుంటుందో నువ్వు గంతే.. కడియం శ్రీహరి అవినీతి తిమింగళం.. మంత్రి పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఏం పని చేశావో అన్నీ నాకు తెలుసు నా దగ్గర ఒక పుస్తకం ఉంది.. అవసరం వచ్చినప్పుడు పుస్తకం బయటపెట్టి నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో బయటకు తీస్తానని తాటికొండ రాజయ్య అన్నాడు.

Read Also: Man Kills Neighbours: పిల్లలను కనవా.. అని అడిగినందుకు సుత్తితో కొట్టి ముగ్గురిని చంపేశాడు..

నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఘనపూర్ నియోజకవర్గానికి కుదవబెట్టి సింగపూర్, మలేషియాలో ఆస్తులు సంపాదించావు అని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఖానాపూర్ నడిబొడ్డున నేను పుట్టాను నా అడ్డా గడ్డ ఘనపురమే.. 2014, 2018 ఎన్నికల కోసం నా ఆస్తులన్నీ అమ్ముకున్నా.. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్న చరిత్ర నాది అయితే.. ఆస్తులు కూడబెట్టిన చరిత్ర నీది అంటూ కడియం శ్రీహరిపై రాజయ్య విమర్శలు గుప్పించారు. ఇన్నీ రోజులు రాకుండా.. మళ్లీ మళ్లీ ఇప్పుడు మీ ముందుకు ఊసరవెల్లిలా రంగులు మార్చినట్లు వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ దొంగచాటు మీటింగులు పెడుతున్నావు.. నువ్వు నిజమైన బీఆర్ఎస్ నాయకుడివి అయితే రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టు.. నువ్వు నేను చూసుకుందాం అని కడియంకు రాజయ్య సవాల్ విసిరారు.

Read Also: Delhi Rains: ఢిల్లీలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు

పార్టీ నుంచి బహిష్కరించబడిన వారు మాత్రమే నీతో ఉంటున్నారు.. పార్టీ పైనా అసంతృప్తులుగా ఉన్నా వాళ్లే కడియం శ్రీహరి వెంట ఉంటున్నారని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఈరోజు నుంచి ఎన్నికల వరకు ప్రతిరోజు తిరుగుతు.. ప్రతి ఊరిలో డప్పు కొడుతాను అని రాజయ్య అన్నారు. పైసలిచ్చి గెలిచే రోజులు పోయినాయి.. నియోజకవర్గంలో నాలాగా ఉరకాలంటే నీ గుండె ఆగిపోతుంది.. ప్రతిపక్షాల పప్పులు ఉడకకుండా కేసీఆర్ మొండి అయితే.. నేను కేసీఆర్ ను మించిన జగమొండిని అంటూ రాజయ్య వ్యాఖ్యనించారు. అభివృద్ధి కార్యక్రమాలలో ఈరోజు కూడా కొబ్బరికాయ కొట్టని నేతలు కూడా అభివృద్ధి చేసిన అని సిగ్గు శరం లేకుండా చెప్తున్నారని ఆయన చెప్పారు. 20 సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరమై.. ప్రజలకు దూరమై తన వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ రాజకీయాన్ని తన వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడు అని రాజయ్య అన్నారు.

Exit mobile version