NTV Telugu Site icon

నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి… ఒకరి తర్వాత ఒకరిని తన ఛాంబర్‌ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి, కడియం శ్రీ హరి, బండా ప్రకాశ్‌, వెంకట్రామిరెడ్డి, తక్కళ్ల పల్లి రవీందర్‌ రావు, పాడి కౌశిక్‌ రెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం విదితమే. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి.. నోటిఫికేషన్‌ జారీ అయింది. దీంతో వీరి ఎమ్మెల్సీల పదవీకాలం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే నేడు వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.