పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల నియోజకవర్గంలో వైస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో మూడు రోజులుగా అట్టుడికిపోతున్నాయి. మంగళవారం నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లలో ఏపీ డీఐజీ త్రిపాఠి మకాం వేశారు. పోలింగ్ జరిగి మూడు రోజులవుతున్నా ఇంకా చల్లారని ఉద్రిక్తత నెలకొని ఉంది.
Also Read: Canada : కెనడాలో తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి.. ప్రమాదంలో చమురు నిల్వలు
ఈ నేపథ్యంలో మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్ కొనసాగుతుంది. దింతో పిన్నెల్లి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్బంగా బయట వ్యక్తులు ఎమ్మెల్యేని కలిసేందుకు పోలీసులు అనుమతి ఐవడం లేదు.
Also Read: Bandi Sanjay: యాక్టీవా పై మేనల్లుడితో షికార్.. బేకరీకి వెళ్లిన బండి సంజయ్