MLA Peddireddy Ramachandra Redy: తిరుపతి జిల్లా పుంగనూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిన్నారి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కూడా పోలీసులు దోషులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ లేదని,పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్తున్నారన్నారు.
Read Also: Biryani Offer: మూడు రూపాయలకే బిర్యానీ.. బారులు తీరిన జనం
చిన్నారి దారుణంగా చనిపోతే ప్రభుత్వం స్పందించలేదన్నారు. కానీ ఏమీ జరగనటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాద ఘటనలో మాత్రం డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపిందన్నారు. కానీ చిన్నారి చనిపోతే ఇప్పటివరకు సీఎం గాని, మంత్రులు గాని స్పందించలేదన్నారు. పోలీసులు వెంటనే స్పందించి దోషులను శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. తొమ్మిదో తారీఖున సీఎం జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.