MLA Parthasarathy: మాజీ మంత్రి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి పెనమలూరు టికెట్ ఇవ్వకుండా.. ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని నియమించింది వైసీపీ అధిష్టానం.. ఈ పరిణామాలతో టీడీపీతో టచ్‌లోకి వెళ్లిన పార్థసారథి.. త్వరలోనే సైకిల్ ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ, ప్రభుత్వంపై ఎమ్మెల్యే పార్థసారధి విమర్శలు మొదలుపెట్టారు.
వైసీపీ వీడాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Varla Ramaiah: సీఈసీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ
మంత్రులు బూతులు తిట్టడానికి మాత్రమే కాదు, రైతుల సమస్యలు పరిష్కారం కోసం కూడా సమీక్షలు పెట్టాలని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఆర్‌బీకే నుంచి మిల్లర్లకు తరలించిన ధాన్యం రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా తేమ శాతం పేరుతో బస్తాపై 300 నుంచి 400 రూపాయలు తగ్గించి ఇస్తున్నారన్నారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసగిస్తున్నా అధికారులు, మంత్రులు స్పందించడం లేదన్నారు. ఇక్కడ ధాన్యాన్ని కడప, కర్నూలు, నెల్లూరు మిల్లులకు తరలించి ఇక్కడ మిల్లర్లకు సైతం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే పార్థసారథి వెల్లడించారు.