MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి CID నోటీసులు.. స్పందించిన ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చారు.. సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు, ట్రాఫిక్‌కు కౌశిక్ రెడ్డి అంతరాయం కలిగించారు.. పోలీసుల పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు సీఐడీ నోటీసుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 4న ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని సీఐడీ ఆదేశించింది. ఇక ఈ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సీఐడీ నోటీసులు జారీ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో తన కుటుంబ సభ్యులను, అలాగే పార్టీకి చెందిన ఇతర కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనపై చర్యలు తీసుకోవచ్చని, కేసులు పెట్టవచ్చని, నోటీసులు ఇవ్వవచ్చని కానీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అన్యాయమని స్పష్టం చేశారు.
READ MORE: Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!
Also Read
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తుల కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
- CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
తనను నేరుగా లక్ష్యంగా చేసుకోవాలని, కానీ కుటుంబ సభ్యులను వేధించడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అయినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తాను ప్రశ్నించడం ఆపనని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత పోరాటం కాదని, ప్రజల కోసం చేసే బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ప్రశ్నించే గొంతును ఎవరూ అణచలేరని, ప్రజల ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆ నాయకుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మేకోవర్.. 10 స్టేషన్లతో కొత్త ప్లాన్.!
-
Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తుల కీలక వ్యాఖ్యలు
-
CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
-
Tati Garelu: నోరూరించే సంప్రదాయ వంటకం..’తాటి గారెలు’ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా తయారు చేసుకోండి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!