Site icon NTV Telugu

Balakrishna: రంగంలోకి దిగిన బాలయ్య.. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

Balakrishna: ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా తమ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హిందూపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలప్తె ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టి సారించారు.

Read Also: Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలకు బ్రేక్‌

నేటి నుంచి రెండు రోజుల పాటు కార్యకర్తలతో బాలయ్య సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ చిలమత్తూరు మండంలోని పంచాయితీ వారీగా కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించనున్నారు. గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.. వాటిని ఎలా ధీటుగా ఎదుర్కొనాలి , ఓట్లు మార్పులు – చేర్పులు అంశాలప్తె ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశాలకు మీడియాకు అనుమతి లేదని , పూర్తిగా అంతర్గత వ్యవహరం అని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Exit mobile version