అమరావతి మండలం వైకుంఠపురంలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు వంగవీటి నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రతి ఇంటికి అందిన సంక్షేమాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కాపులకు తానెప్పుడూ అండగా నిలిచానన్నారు. మరోసారి తనకు అండగా ఉండి ఆశీర్వదిస్తే.. నియోజకర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను అని చెప్పుకొచ్చారు.
Read Also: Hyderabad: నగరంలో ఏరులై పారుతున్న మద్యం.. ఎంట్రీ ఇచ్చిన ఎస్ఓటీ బృందం
ఇక, వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట ఇస్తే వెనుకడుగు వేయరన్నారు. అందుకే అమ్మఒడి, కాపునేస్తం, విద్యాదీవెన, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కరోనా వంటి కష్టకాలంలో కూడా సక్రమంగా అమలయ్యాయన్నారు. చంద్రబాబులా తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయరన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అవసరమైతే తన సొంత డబ్బుతో అభివృద్ధి చేస్తారు తప్ప.. మాట ఇస్తే వెనక్కు వెళ్లరు అన్నారు. శంకరరావు కృషి వల్లే అమరావతి – బెల్లంకొండ రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జి, క్రోసూరు పాలిటెక్నిక్ కాలేజ్ వంటివి సాధ్యం అయ్యాయని అన్నారు. జగన్ ప్రభుత్వంలో కాపులకు ఆర్థికంగా, సామాజికంగా తగిన గుర్తింపు లభించింది.. అందుకే ఈ ఎన్నికల్లో కాపులంతా సీఎం జగన్ కు అండగా ఉండాలని కోరారు. పెదకూరపాడు ఎమ్మెల్యేగా నంబూరు శంకరరావుని, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలన్నారు. కొత్తవాళ్లు వచ్చినప్పుడు అనేక తప్పుడు వాగ్దానాలు చేస్తారు.. వాటిని నమ్మొద్దు.. టీడీపీ వాళ్లు కనీసం సీట్ల విషయంలో కూడా కాపులకు న్యాయం చేయలేదని వైసీపీ నేత వంగవీటి నరేంద్ర విమర్శించారు.
Read Also: Manish Sisodia: ఢిల్లీ హైకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్
అలాగే, రేపు ( శుక్రవారం) పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ నేపథ్యంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్.. సభా వేదిక, హెలీప్యాడ్ వంటి ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే వారి కోసం పార్కింగ్ సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం సభకు భారీగా ప్రజలు తరలి వస్తారని.. అందుకు తగినట్టు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు క్రోసూరులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది.